All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Thelusaa, Manasaa, Idi Yenaati Anubandhamo Song in Telugu - Criminal Movie - Nagarjuna, Manisha Koyirala, Ramya Krishna


************************************
Movie Details
************************************

Movie : Criminal (1995)
Song : Thelusaa, Manasaa, Idi Yenaati Anubandhamo
Star-Casting : Nagarjuna, Manisha Koyirala, Ramya Krishna
Lyrics : Sirivennela Seetharama Saasthri
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : M.M.Keeravani
Key-Words : Telusa, Manasa, Idi Yenati

*****************************
Song Lyrics
*****************************

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడులోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడికన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం నా కళ్ళలొ నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపే నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పదికాలాలు వుంటాను నీ పేమ సాక్షిగా

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

Darling
Every breath you Take
Every move you Make
I will be there with you
What would I do without you
I want to love you forever
and ever
and ever

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగే మెల్లగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడులోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడికన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో

Santhosham Sagam Balam Haayiga Navvamma Song in Telugu - Chirunavvutho Movie - Venu Thottempudi, Shahin


************************************
Movie Details
************************************

Movie : Chirunavvutho (2000)
Song : Santhosham Sagam Balam Haayiga Navvamma
Star-Casting : Venu Thottempudi, Shahin
Lyrics : Sirivennela Seetharama Saasthri
Singer(s) : S.P.Balu
Music : Mani Sharma
Key-Words : Santosam Sagam Balam

*****************************
Song Lyrics
*****************************

సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళీ
ఓ ఓ

సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా 
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళీ
ఓ ఓ

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకూ
మిణుగురులా మిల మిలమెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిశి విల విలలాడుతూ పరుగులు  తీయ్యదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళీ
ఓ ఓ

ఆశలు రేపినా అడిఆశలు చూపినా 
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడిఆశలు చూపినా 
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తల్చుకుంటూ నిద్రమానుకోగలమా
ఎంతమంచి స్వప్నమైన అందులోనే వుంటూ లేవకుండా ఉండగలమా
కలలుగనీ అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలనే నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో ఆ లేదా జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళీ
ఓ ఓ

సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా

Chalthikaa Naam Gaadi, Chalaaki Vanne Ledi Song Lyrics in Telugu - Chettukinda Pleader Movie - Raajendra Prasad, Kinnera


************************************
Movie Details
************************************

Movie : Chettukinda Pleader (1989)
Song : Chalthika Naam Gaadi, Chalaaki Vanne Ledi
Star-Casting : Raajendra Prasad, Kinnera
Lyrics : Vennelakanti
Singer(s) : S.P.Balu, Chitra
Music : Ilayaraaja
Key-Words : Chalthika Naam Gaadi

*****************************
Song Lyrics
*****************************

చల్తీకా నామ్ గాడీ
చలాకీ వన్నె లేడీ

చల్తీకా నామ్ గాడీ
చలాకీ వన్నె లేడీ
రంగేళీ జోడీ
బంగారు బాడీ
వేగంలో చేసెను దాడీ వేడెక్కి ఆగెను ఓడీ
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవ చెప్పవా

చల్తీకా నామ్ గాడీ
చలాకీ వన్నె లేడీ
రంగేళీ జోడీ
బంగారు బాడీ
వేగంలో చేసెను దాడీ
వేడెక్కి ఆగెను ఓడీ
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవ చెప్పవా

దేవతలే మెచ్చిన కారు
దేశాలే తిరిగిన కారు
వీరులకు ఝాన్సీ కారు
హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుద్ధంలోనా వాడిందీ ఈ కారూ
శివాజీ గుఱ్ఱం వీడీ ఎక్కిందీ ఈ కారూ
చరిత్రల లోతులు చేరి రాతలు మారి చేతులు మారినదీ
జంపరు బంపరు బండిరా బండిరా
జగమొండిరా మొండిరా

చల్తీకా నామ్ గాడి
చలాకీ వన్నె లేడి

ఆంగ్లేయులు తోలిన కారు
ఆంధ్రానే ఏలిన కారు
అందాల లండన్ కారు
అన్నింటా ఎండన్  కారు
బులెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారూ
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారూ
హుషారుగా ఎక్కిన చాలు దక్కును మేలు చిక్కు సుఖాలు
ఇదే సూపర్ డూపర్ బండిరా బండిరా
జగమొండిరా మొండిరా

చల్తీకా నామ్ గాడీ
చలాకీ వన్నె లేడీ
రంగేళీ జోడీ
బంగారు బాడీ
వేగంలో చేసెను దాడీ
వేడెక్కి ఆగెను ఓడీ
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవ చెప్పవా

చల్తీకా నామ్ గాడి
చలాకీ వన్నె లేడి

Palike Myna


పాటలంటే ఇష్టపడని వాళ్లంటూ వుండరు. అది ఒక మంచి సాహిత్యమైతే సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకు ఆ పాట ఒక మధుర జ్ఞాపకం.అది ఒక మంచి సంగీతం అయితే అది ఒక మధుర రాగంగా గుర్తుండిపోతుంది.అది ఒక మంచి గళం అయితే అది ఒక మరువలేని గాత్రంలా హృదయంలో నిలిచిపోతుంది .అటువంటి పాటలను ఈ బ్లాగ్ తెలుగులో సమర్పిస్తోంది.



కొన్ని అక్షరాలను చేర్చితే, అది ఒక పదమవుతుంది.

కొన్ని పదాలను చేర్చితే, అది ఒక మాటవుతుంది.

కొన్ని మాటలకు కవిత్వాన్ని చేర్చితే, అది ఒక మంచి సాహిత్యం అవుతుంది.

కొన్ని సాహిత్యాలకు రాగాన్ని చేర్చితే, అది ఒక మంచి పాటవుతుంది.

కొన్ని పాటలకు స్వరంతో అభిషేకిస్తే, అది ఒక గళానికి  అలంకారమవుతుంది .

అలాంటి పాటలు ఎప్పటికీ కొలువుండే నిలయం ఏదంటే……..

తప్పకుండా అది ఒక హ్రదయమే  అవుతుంది.





Nammaka Thappani Nijamaina Song in Telugu - Bommarillu Movie - Siddarth, Genelia D'Souza


************************************
Movie Details
************************************

Movie : Bommarillu
Song : Nammaka Thappani Nijamaina
Star-Casting : Siddarth, Genelia D'Souza
Lyrics : Chandra Bose
Singer(s) : Sagar, Sumangali
Music : Devi Sri Prasad
Key-Words : Nammaka Tappani Nizamaina

*****************************
Song Lyrics
*****************************

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా 
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే వున్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా ఓ ఓ
కన్నులు తెరిచే వున్నా నువు నిన్నటి కలవే ఐనా  
ఇప్పటికీ ఆ కలలోనే వున్నా

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ

ఈ జన్మంతా విడిపోదీ జంటా 
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏచోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అలా 
వెనిదిరిగిన చెలిమి అలా
తడి కనులతొ నిను వెతికేది ఎలా

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా  ఓ ఓ

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయానుకోనా
నా ఊహల్లో కలిగేవేదనలో
ఇన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమ
చిరుజల్లుల పరిమమమా
చేజారిన ఆశల తొలి వరమా

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం  నా చూపులనొదిలేనా ఓ ఓ

O Prema, Naa Premaa, Preme Naaku (Male Version) Song in Telugu - Chanti Movie - Venkatesh, Meena


************************************
Movie Details
************************************

Movie : Chanti (1992)
Song : Oo Prema, Naa Premaa, Preme Naaku Daivam (Male Version)
Star-Casting : Venkatesh, Meena
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balu
Music : Ilayaraaja
Key-Words : O Prema, Na Prema, Preme Naaku

*****************************
Song Lyrics
*****************************

ఓ ప్రేమా
నా ప్రేమా 
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమా 
నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం
రప్పించేను నీ ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమా 
నా పాటే వినరావా

గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమా
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమా నా ప్రేమా 
ప్రేమే నాకు దైవం
నా పాటే వినరావా
నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం
రప్పించేను నీ ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమా 
నా పాటే వినరావా

Ninnu Thalachi Maimaracha Chitrame Song in Telugu - Vichithra Sodarulu Movie - Kamal Hasan, Gouthami


************************************
Movie Details
************************************

Movie : Vichithra Sodarulu (1989)
Song : Ninnu Thalachi Maimarachaa Chitrame
Star-Casting : Kamal Hasan, Gouthami
Lyrics : Raajashri
Singer(s) : S.P.Balu
Music : Ilayaraaja
Key-Words : Ninnu Talachi Maimaracha

*****************************
Song Lyrics
*****************************

నిన్ను తలచీ మైమరచా
చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే 
ఓ చెలీ

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం
జోరు వానలోనా ఉప్పునైతి నేనే
హోరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా
అంతే 

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేనూ కట్టుకున్న కోటా
నేడు కూలిపోయే ఆశ తీరు పూటా
కోరుకున్న యోగం జారుకుంది నేడూ
చీకటేమో నాలో చేరుకుంది చూడూ
రాసివున్న తలరాత తప్పదూ చిత్రమే అది చిత్రమే
గుండెకోతలే నాకు ఇప్పుడూ చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా
అంతే 

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈ నాడు తెలిసెనులే 
ఓ చెలీ

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే