************************************
Movie Details
************************************
Movie : Andhra Kesari
Song : Vedamlaa Ghoshinche Godaavari
Star-Casting : Vijaya Chandra, Murali Mohan
Lyrics : Aarudra
Singer(s) : S.P.Balu
Music : Sathyam
Key-Words : Vedamla Ghoshinche
*****************************
Song Lyrics
*****************************
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
రాజ రాజ నరేంద్రుడు కాకతీయులూ
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులూ
గజపతులూ నరపతులూ ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
నవకవితలు వికసించే నందన వనమూ
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
దిట్టమైన శిల్పాల దేవళాలూ
కట్టుకథల చిత్రాంగీ కనకమేడలూ
దిట్టమైన శిల్పాల దేవళాలూ
కట్టుకథల చిత్రాంగీ కనకమేడలూ
కొట్టుకొనీ పోయె కొన్ని కోటిలింగాలూ
వీరేశలింగమొకడు మిగిలెనుచాలూ
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ
Tagged
Vedamlaa-Ghoshinche-Godaavari Vedamlaa-Ghoshinche-Godavari Vedamla-Ghoshinche-Godavari Vedamlaa-Ghoshinche Vedamla-Ghoshinche Vedamlaa-Ghoshinche-Godavari Vedamlaa-Ghoshinche Andhra-Kesari Aandhra-Kesari Andhra-Kesari-Songs Aandhra-Kesari-Songs