All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Maate Raani Chinnadaani Kallu Palike Song in Telugu - Oo Paapa Laali Movie - S.P.Balasubramanyam, Radhika


************************************
Movie Details
************************************

Movie : Oo Paapa Laali
Song : Maate raani Chinnadaani Kallu Palike
Star-Casting : S.P.Balasubramanyam, Radhika
Lyrics : Veturi Sundararama Murthy
Singers : S.P.Balu
Music : Ilayaraja
Key-Words : Maate raani Chinna daani


*****************************
Song Lyrics
*****************************

మాటేరాని  చిన్నదానీ  కళ్ళు పలికే  ఊసులూ
అందాలన్ని  పల్లవించి  ఆలపించే  పాటలూ
ప్రేమే నాకు పంచే  జ్ఞాపకాలురా
రేగే మూగతలపే  వలపు పంటారా

మాటేరాని  చిన్నదానీ  కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి  ఆలపించే  పాటలూ
ప్రేమే నాకు పంచే  జ్ఞాపకాలురా
రేగే మూగతలపే  వలపుపంటారా

వెన్నెలల్లె పూలు విరిసి  తేనెలు చిలికెను
చంతచేరి ఆదమరిచి   ప్రేమను  కొసరెను
చందనాలు ఝల్లు కురిసె  చూపులు  కలిసెను 
చందమామ పట్టపగలె  నింగిని  పొడిచెను
కన్నెపిల్ల కలలే  నాకిక లోకం
సన్నజాజి కళలే  మోహనరాగం
చిలకల  పలుకులు  అలకలు  ఉలుకులు నా చెలిసొగసులు నన్నే మరిపించే 

 మాటేరాని  చిన్నదానీ  కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని  పల్లవించి   ఆలపించే  పాటలూ

ముద్దబంతి లేత నవ్వులు  చిందెను మధువులు
ఊసులాడు మేనివగలు  వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు  నా చెలి సొగసులు  
వేకువల మేలుకొలుపె  నా చెలి  పిలుపులు
సంధ్యవేళ పలికే  నాలో పల్లవి
సంతసార సిరులే  నావే అన్నవి
ముసి ముసి తలపులు  తరగని వలపులు  నాచెలిసొగసులు అన్నీఇక నావే

మాటేరాని  చిన్నదానీ  కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి  ఆలపించే  పాటలూ
ప్రేమే నాకుపంచే  జ్ఞాపకాలురా
రేగే  మూగతలపే  వలపుపంటారా 

 మాటేరాని   చిన్నదానీ  కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని  పల్లవించి   ఆలపించే పాటలూ 

Chukkallara Choopullara Yekkadamma Jaabili Song in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri


************************************
Movie Details
************************************

Movie : Aapadbhandavudu
Song : Chukkallara Choopullara Yekkadamma Jaabili
Star-Casting : Chiranjeevi, Meenakshi SheShadri
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : M.M.Keeravani
Key-Words : Chukkallara Choopullara


*****************************
Song Lyrics
*****************************

చుక్కల్లారా  చూపుల్లారా  ఎక్కడమ్మా జాబిలీ
మబ్బులారా  మంచుల్లారా   తప్పుకోండే దారికీ
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ
విన్నవించారా  వెండిమింటికీ
జో జో  లాలీ 
జో జో  లాలీ
జో జో  లాలీ 
జో జో  లాలీ

మళిసంజ వేళాయే  చలిగాలి వేణువాయే
మళిసంజ వేళాయే  చలిగాలి వేణువాయే 
నిదురమ్మా  ఎటుబోతివె
మునిమాపు వేళాయే  కనుపాప నిన్ను కోరే 
కునుకమ్మా  ఇటు చేరవే
తన్నన్నన్న తనన  
తన్నన్నన్న తాననా 
నిదురమ్మా  ఎటుబోతివే
 ఇటు చేర
గోధూళి  వేళాయె  గూళ్ళన్నీ కనులాయే
గోధూళి  వేళాయె  గూళ్ళన్నీ కనులాయే
గువ్వలరెక్కల పైనా  రివ్వూ రివ్వున రావే
జోలపాడవా  వేలకళ్ళకీ 
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ 
జో జో  లాలీ  
జో జో  లాలీ

పట్టు పరుపులేల   పండు వెన్నెలేల  అమ్మఒడి చాలదా  బజ్జోవె తల్లి
పట్టు పరుపేలనే 
అమ్మఒడి చాలునే  నిను చల్లంగ జోకొట్టునే
నార దాదులేలా  నాద బ్రాహ్మలేల  
అమ్మలాలి చాలదా  బజ్జోవె తల్లి  
నారదాదులేలనే   నాద బ్రాహ్మలేలనే  
అమ్మలాలి చాలునే  నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో  ఎన్ని వేల  వెన్నెల్లో
తీయ్యనైన కలలెన్నో  ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడికొమ్మలా  ఏడి ఏవయ్యాడే అంతు లేడియాల  కోటితందనాల  ఆనందలాలా
గోవులాల పిల్లగోవులాల గొల్లభామలాల యాడ నుందీయాల  నాటినందనాల  ఆనందలీలా
జాడ చెప్పరా  చిట్టి తల్లికీ
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ
జో జో జోలాలీ   
జో జో లాలీ

చుక్కల్లారా  చూపుల్లారా  ఎక్కడమ్మా జాబిలీ
మబ్బులారా  మంచుల్లారా  తప్పు కోండే దారికీ

Priyathama Nanu Palakarinchu Pranayama Song in Telugu - Jagadeka Veerdu Athiloka Sundari Movie - Chiranjeevi, Sridevi


************************************
Movie Details
************************************

Movie : Jagadeka Veerdu Athiloka Sundari
Song : Priyathamaa Nanu Palakarinchu Pranayamaa
Star-Casting : Chiranjeevi, Sridevi
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balasubramanyam, Janaki
Music : Ilayaraja
Key-Words : Priyathama nanu palakarinchu


*****************************
Song Lyrics
*****************************

ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
బ్రతుకులోని  బంధమా  పలుకలేని భావమా
మరువలేని స్నేహమా  మరలిరాని నేస్తమా
ప్రియతమా   ప్రియతమా  ప్రియతమా   

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా  
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
ఎదుటవున్న స్వర్గమా  చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా  కౌగిలింత ప్రాణమా
ప్రియతమా   ప్రియతమా  ప్రియతమా  

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా

నింగి వీణకేమొ  నేల పాటలొచ్చె  తెలుగూ జిలుగూ అన్నీ తెలిసి
పారిజాత పువ్వు  పచ్చి మల్లెమొగ్గ   వలపే తెలిపే నాలోవిరిసి
మచ్చలెన్నో వున్నా  చందమామకన్నా  నరుడే వరుడై నాలోమెరిసే
తారలమ్మ కన్నా  చీరకట్టుకున్నా పడుచూ తనమే నాలోమురిసే
మబ్బులన్నీ వీడిపోయి  కలిసే నయనం  తెలిసే హృదయం  
తారాలన్నీ దాటగానే   తగిలే గగనం  రగిలే విరహం 
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి  గొంతులో  ఎన్ని మూగపాటలో అడుగే పడకా గడువే గడిచీ పిలిచే 

 ప్రియతమా   నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదొ  వేణువూదిపోయె   శ్రుతిలోజతిలో నిన్నేకలిపి
దేవగానమంతా  ఎంకిపాటలాయె  మనసుమమతా  అన్నీకలిసీ
వెన్నెలల్లే వచ్చి  వేదమంత్రమాయె  బహుశామనసా  వాచావలచి
మేనకల్లేవచ్చి  జానకల్లేమారె  కులమూ గుణమూ  అన్నీకుదిరీ
నీవులేని నింగిలోన  వెలిగేఉదయం  విధికే విలయం
నీవులేని నేలమీద  బ్రతుకేప్రళయం  మనసేమరణం
వాన విల్లు గుండెలో  నీటికెన్ని రంగులో
అమృతాల విందులో  ఎందుకిన్ని హద్దులో  జగమే అణువై యుగమె క్షణమై మిగిలే 

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
బ్రతుకులోని  బంధమా  పలుకలేని భావమా
కనులలోని కావ్యమా  కౌగిలింత ప్రాణమా
ప్రియతమా    ప్రియతమా    ప్రియతమా

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా

Yevvarineppudu Thana Valalo Bandhisthundi Song in Telugu - Manasantha Nuvve Movie - Uday Kiran, Reemasen, Sunil


************************************
Movie Details
************************************

Movie : Manasantha Nuvve
Song : Yevvarineppudu Thana Valalo
Star-Casting : Uday Kiran, Reemasen, Sunil
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : Krishna Kumar Kunnath
Music : R.P.Patnayak
Key-Words : Evvarineppudu Thana Valalo

*****************************
Song Lyrics
*****************************


ఎవ్వరినెప్పుడు తన వలలో  బంధిస్తుందో ఈ ప్రేమా
ఏ మదినెప్పుడు మబ్బులలో  ఎగరేస్తుందో ఈ ప్రేమా
అర్థం కాని పుస్తకమే  అయినా గానీ ఈ ప్రేమా
జీవిత పరమార్థం తానే  అనిపిస్తుందీ ఈ ప్రేమా
ప్రేమా  ప్రేమా  ఇంతేగా ప్రేమా 
ప్రేమా  ప్రేమా  ఇంతేగా   ప్రేమా 

ఇంతకు ముందర ఎందరితో  ఆటాడిందీ ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో  మీ గాధే  మొదలంటుందీ ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో   కనబడుతుందీ ఈ ప్రేమా
కలిసిన వెంటనే ఏమౌనో   చెప్పదు పాపం ఈ ప్రేమా

ప్రేమా  ప్రేమా  ఇంతేగా ప్రేమా 
ప్రేమా  ప్రేమా  ఇంతేగా  ప్రేమా 

Aura Ammaka Chella Aalakinchi Nammadamella Song in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri


************************************
Movie Details
************************************

Movie : Aapadbhandavudu
Song : Aura Ammaka Chella, Aalakinchi Nammadamella
Star-Casting : Chiranjeevi, Meenakshi SheShadri
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : M.M.Keeravani
Key-Words : Aura ammaka chella


*****************************
Song Lyrics
*****************************

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడమెల్ల 
అంత వింత గాధల్లో  ఆనంద లాలా
బాపురే బ్రహ్మకుచెల్ల  వైనమంత వల్లించ వల్ల  
రేపల్లె వాడల్లో  ఆనందలీలా
అయినవాడే  అందరికీ  అయినా అందడు ఎవ్వరికీ
అయినవాడే  అందరికీ  అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా  గోపాలుడా  లోకాల పాలుడ
తెలిసేది ఎలా ఎలా  ఛాంగు భళా
తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడవెల్ల
అంతవింత గాధల్లో  ఆనందలాలా

నల్ల రాతి కండలతో హొయ్  కరుకైన వాడే
వెన్నముద్ద గుండెలతో హొయ్  కరుణించుతోడే
నల్ల రాతి కండలతో కరుకైన వాడే  ఆనంద లాలా
వెన్న ముద్ద గుండెలతో కరుణించుతోడే  ఆనంద లీలా
ఆయుధాలు పట్టను అంటూ  బావ బండి తోలిపెట్టే ఆనంద లాలా
జాణ జాన పదాలతో  జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీలా
బాలుడా గోపాలుడా  లోకాల పాలుడా
తెలిసేది ఎలా  ఎలా  ఛాంగు భళా

ఔరా  అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడమెల్ల
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకుచెల్ల వైనమంత వల్లించ వల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీల

ఆలమంద కాపరిలా కనిపించ లేదా  ఆనంద లాలా
ఆలమందు కాలుడిలా అనిపించు కాదా  ఆనంద లీలా
వేలితో కొండను ఎత్తే  కొండంత వేలు పట్టే  ఆనంద లాలా
తులసీ దళానికి తేలిపోయి తూగునటే ఆనంద లీలా
బాలుడా  గోపాలుడా   లోకాల  పాలుడా
తెలిసేది  ఎలా  ఎలా  ఛాంగుభళా

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడవెల్ల
అంత వింత గాధల్లో  ఆనంద లాలా
బాపురే బ్రహ్మకుచెల్ల  వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

Paruvam Vaanagaa Nedu Kurisenule Song in Telugu - Roja Movie - Madhu bala, Aravind Swamy


************************************
Movie Details
************************************

Movie : Roja
Song : Paruvam Vaanagaa Nedu Kurisenule
Star-Casting : Madhu bala, Aravind Swamy
Lyrics : Rajashri
Singer(s) : S.P.Balu, Sujaatha
Music : A.R.Rehman
Key-Words : Paruvam Vaanagaa

*****************************
Song Lyrics
*****************************

పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే
నా ఒడిలోన  ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన  ఒక తోడు ఎదకోరెనే  

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే
నా ఒడిలోన  ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన  ఒక తోడు ఎదకోరెనే
నదివే నీవైతే   అల నేనే
ఒక పాటా  నీవైతే  నీ రాగంనేనే 

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే

నీ   చిగురాకు చూపులే  అవి నా   ముత్యాల సిరులే 
నీ  చిన్నారి ఊసులే  అవి నా  బంగారు నిధులే
నీ పాల పొంగుల్లో  తేలనీ   నీ గుండెలో నిండనీ
నీ  నీడలా వెంట సాగనీ  నీ కళ్ళల్లో  కొలువుండనీ  

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే
నా ఒడిలోన  ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన  ఒక తోడు ఎదకోరెనే  

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే

నీ   గారాల చూపులే  నాలో  రేపెను మోహం
నీ   మందార నవ్వులే  నాకే   వేసెను బంధం
నా లేత మధురాల  ప్రేమలో నీ కలలు పండించుకో
నా  రాగ బంధాల చాటులో  నీ పరువాలు పలికించుకో 

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే
నా ఒడిలోన  ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన  ఒక తోడు ఎదకోరెనే
నదివే నీవైతే   అల నేనే
ఒక పాటా  నీవైతే  నీ రాగం నేనే 

 పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే 

పరువం వానగా  నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో  ఈడు తడిసేనులే

Mounangaane Yedagamani (Female Version) Song in Telugu - Naa Autograph Sweet Memories Movie - Ravi Teja, Bhoomika, Gopika


*****************************
Song Lyrics
*****************************

Movie : Naa Autograph Sweet Memories
Song : Mounangaane Yedagamani Mokka Neeku  (Female Version)
Star-Casting : Ravi Teja, Bhoomika, Gopika
Lyrics : Chandra Bose
Singer(s) : Chitra
Music : M.M.Keeravani
Key-Words : Mounangane Eedagamani

*****************************
Song Lyrics
*****************************

మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ   అర్థమందులోవుందీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులోవుందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే  కొత్త చిగురు కనిపిస్తుంది 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ   అర్థమందులోవుందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుందీ
ఆకులన్ని రాలిన చోటే  కొత్త చిగురు కనిపిస్తుందీ

దూరమెంతొ ఉందనీ  దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందనీ  బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంటా ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే  విషమే వచ్చిందీ
విసుగే చెందక కృషి చేస్తేనే  అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ  తలుచుకుంటె సాధ్యమిదీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుందీ
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులో  ఉందీ

చెమటనీరు చిందగా  నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని  గుర్తుంచుకో
పిడికిలే బిగించగా  చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని  గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను  బ్రహ్మేరాస్తాడూ
నచ్చినట్టుగా నీ తలరాతను  నువ్వే వ్రాయాలీ
నీ ధైర్యాన్ని దర్షించి   దైవాలే   తలదించగా
నీ అడుగుల్లొ గుడి కట్టి  స్వర్గాలె  తరియించగా
నీ సంకల్పానికి  ఆ విధి సైతం చేతులెత్తాలి

అంతులేని చరితలకీ  
ఆది నువ్వు కావాలీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుందీ
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులో ఉందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుందీ
ఆకులన్ని రాలినచోటే  కొత్త చిగురు కనిపిస్తుందీ






Tagged :

Mounangaane-Yedagamani-Mokka-Neeku Mounangaane-Yedagamani-Mokka Mounangaane-Yedagamani Mounangaane-Yedagamani-Mokka-Neeku Mounangaane-Yedagamani-Mokka-Neeku-Female Mounangaane-Yedagamani-Mokka-Female Mounangaane-Yedagamani-Female Mounangaane-Yedagamani-Mokka-Neeku-Female Mounangane-Yedagamani-Mokka-Neeku Mounangane-Yedagamani-Mokka Mounangane-Yedagamani Mounangaane-Edagamani-Mokka-Niku-Female Mounangaane-Edagamani-Mokka-Female Mounangaane-Edagamani-Female Mounangaane-Edagamani-Mokka-Niku-Female Mounangaane-Edagamani-Mokka-Niku Mounangaane-Edagamani-Mokka Mounangaane-Edagamani Mounangaane-Edagamani-Mokka-Niku Mounangane-Edagamani Mounangane-Edagamani-Mokka Mounangane-Edagamani-Mokka-Niku Mounangane-Edagamani-Female Mounangane-Edagamani-Mokka-Female Mounangane-Edagamani-Mokka-Niku-Female Mounangane-Yedagamani-Mokka-Neeku-Female Mounangane-Yedagamani-Mokka-Female Mounangane-Yedagamani-Female Naa-Autograph-Sweet-Memories Na-Autograph-Sweet-Memories