All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Aura Ammaka Chella Aalakinchi Nammadamella Song in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri


************************************
Movie Details
************************************

Movie : Aapadbhandavudu
Song : Aura Ammaka Chella, Aalakinchi Nammadamella
Star-Casting : Chiranjeevi, Meenakshi SheShadri
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : M.M.Keeravani
Key-Words : Aura ammaka chella


*****************************
Song Lyrics
*****************************

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడమెల్ల 
అంత వింత గాధల్లో  ఆనంద లాలా
బాపురే బ్రహ్మకుచెల్ల  వైనమంత వల్లించ వల్ల  
రేపల్లె వాడల్లో  ఆనందలీలా
అయినవాడే  అందరికీ  అయినా అందడు ఎవ్వరికీ
అయినవాడే  అందరికీ  అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా  గోపాలుడా  లోకాల పాలుడ
తెలిసేది ఎలా ఎలా  ఛాంగు భళా
తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడవెల్ల
అంతవింత గాధల్లో  ఆనందలాలా

నల్ల రాతి కండలతో హొయ్  కరుకైన వాడే
వెన్నముద్ద గుండెలతో హొయ్  కరుణించుతోడే
నల్ల రాతి కండలతో కరుకైన వాడే  ఆనంద లాలా
వెన్న ముద్ద గుండెలతో కరుణించుతోడే  ఆనంద లీలా
ఆయుధాలు పట్టను అంటూ  బావ బండి తోలిపెట్టే ఆనంద లాలా
జాణ జాన పదాలతో  జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీలా
బాలుడా గోపాలుడా  లోకాల పాలుడా
తెలిసేది ఎలా  ఎలా  ఛాంగు భళా

ఔరా  అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడమెల్ల
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకుచెల్ల వైనమంత వల్లించ వల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీల

ఆలమంద కాపరిలా కనిపించ లేదా  ఆనంద లాలా
ఆలమందు కాలుడిలా అనిపించు కాదా  ఆనంద లీలా
వేలితో కొండను ఎత్తే  కొండంత వేలు పట్టే  ఆనంద లాలా
తులసీ దళానికి తేలిపోయి తూగునటే ఆనంద లీలా
బాలుడా  గోపాలుడా   లోకాల  పాలుడా
తెలిసేది  ఎలా  ఎలా  ఛాంగుభళా

ఔరా అమ్మకచెల్ల  ఆలకించి నమ్మడవెల్ల
అంత వింత గాధల్లో  ఆనంద లాలా
బాపురే బ్రహ్మకుచెల్ల  వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనంద లీలా