************************************
Movie Details
************************************
Movie : Kshana Kshanam
Song : Jaamu Raathiri Jaabilamma
Star-Casting : Venkatesh, Sridevi
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu
Music : M.M.Keeravani
Key-Words : Jaamu Raathiri
*****************************
Song Lyrics
*****************************
జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా
ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే కలా
వయారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మా
జోల పాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని
వలపు లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని
జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా
ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరోలోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదురలో నిషారాణీ నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
జామురాతిరి
జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే
కలా
వయ్యారి వాలు కళ్ళలోన
మ్మ్హుహ్మ్మ్ మ్మ్మ్మ్హుహ్మ్మ్ఆహా
స్వరాల ఊయలూగు వేళ