************************************
Movie Details
************************************
Movie : Gaandeevam (1994)
Song : Goruvanka Vaalagaane Gopuraaniki Swaraala Gana Ganaa
Star-Casting : Bala Krishna, Roja, Nageswar Rao, Mohan Laal
Lyrics : Veturi Sundararaama Murthy
Singer(s) : S.P.Balu, M.G.Sreekumar
Music : M.M.Keeravaani
Key-Words : Goruvanka Vaalaagaane Gopuraaniki
*****************************
Song Lyrics
*****************************
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగలేదా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృషుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి జూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింత చిందులేసె అందమైన బాలుడే తన వాడై
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగలేదా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
పడిలేచి వలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్లా నల్లా నీళ్ళల్లోన ఎల్లా కిల్లా పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మా అబ్బాయంటే సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంటా దిక్కుల్లో
ఎవరికి వారే
యమునకు నీరే
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగలేదా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెగిసిన బాలసొగసుల పాటల్లో
ముగ్గందాలా ఇల్లూ నవ్వె సిగ్గందాలా పిల్లా
నవ్వె బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాలా చేలూ నవ్వె పేరంటాలా పూలు నవ్వె గోపెమ్మోచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో
పరవశమేదో
పరిమళమాయె
పువ్వు నవ్వె దివ్వె నవ్వె జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగలేదా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృషుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి జూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుదంత చిందులేసి అందమైన బాలుడే తన వాడై