************************************
Movie Details
************************************
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Song : Andaalalo Aho Mahodayam, Bhoolokame Navodayam
Star-Casting : Chiranjeevi, Sreedevi
Lyrics : Veturi Sundararaama Murthy
Singer(s) : S.P.Balu, S.Jaanaki
Music : Ilayaraaja
Key-Words : Andaalalo Aho Mahodayam
*****************************
Song Lyrics
*****************************
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో
నింగీ నేలా జువ్వించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
లతా లతా సరాగమాడే సుహాసినీ సుమాలతో
వయస్సుతో వసంతమాడీ వరించెనే సరాలనో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా తనానా తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
సరస్సులో శరత్తుకోసం తప్పస్సులే ఫలించగా
సువర్ణికా సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించినా
విహారినై ఇవాళే దివీ భువీ స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మను తాకిన ఆమానికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో
ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం