************************************
Movie Details
************************************
Movie : Bommarillu
Song : Nammaka Thappani Nijamaina
Star-Casting : Siddarth, Genelia D'Souza
Lyrics : Chandra Bose
Singer(s) : Sagar, Sumangali
Music : Devi Sri Prasad
Key-Words : Nammaka Tappani Nizamaina
*****************************
Song Lyrics
*****************************
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే వున్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా ఓ ఓ
కన్నులు తెరిచే వున్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే వున్నా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
ఈ జన్మంతా విడిపోదీ జంటా
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏచోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అలా
వెనిదిరిగిన చెలిమి అలా
తడి కనులతొ నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయానుకోనా
నా ఊహల్లో కలిగేవేదనలో
ఇన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమ
చిరుజల్లుల పరిమమమా
చేజారిన ఆశల తొలి వరమా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మాది ఇపుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా ఓ ఓ