All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Ninnu Thalachi Maimaracha Chitrame Song in Telugu - Vichithra Sodarulu Movie - Kamal Hasan, Gouthami


************************************
Movie Details
************************************

Movie : Vichithra Sodarulu (1989)
Song : Ninnu Thalachi Maimarachaa Chitrame
Star-Casting : Kamal Hasan, Gouthami
Lyrics : Raajashri
Singer(s) : S.P.Balu
Music : Ilayaraaja
Key-Words : Ninnu Talachi Maimaracha

*****************************
Song Lyrics
*****************************

నిన్ను తలచీ మైమరచా
చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే 
ఓ చెలీ

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం
జోరు వానలోనా ఉప్పునైతి నేనే
హోరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా
అంతే 

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేనూ కట్టుకున్న కోటా
నేడు కూలిపోయే ఆశ తీరు పూటా
కోరుకున్న యోగం జారుకుంది నేడూ
చీకటేమో నాలో చేరుకుంది చూడూ
రాసివున్న తలరాత తప్పదూ చిత్రమే అది చిత్రమే
గుండెకోతలే నాకు ఇప్పుడూ చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా
అంతే 

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈ నాడు తెలిసెనులే 
ఓ చెలీ

నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే