************************************
Movie Details
************************************
Movie : Chanti (1992)
Song : Oo Prema, Naa Premaa, Premisthe (Female Version)
Star-Casting : Venkatesh,Meena
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : K.S.Chitra
Music : Ilayaraaja
Key-Words : O Prema, Na Prema, Premisthe
*****************************
Song Lyrics
*****************************
ఓ ప్రేమా
నా ప్రేమా
దైవాలాడే జూదం
దయ్యం పాడే వేదం
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం
రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
క్షణమొక యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
విరహమె సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
స్మృతులకు చితులకు ముగియని కథలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా
జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో
గురుతుంటాను గుండెల్లో
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం
రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
గిరులను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున
కులమని కడుధని కులమనె విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తొడిగితె ఘనతలే పెరుగున
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమా ఓ కాటు వేసే కామా
స్వాగతాలు అనదా చావుకైనా ప్రేమా
మానై నేను బ్రతికున్నా
మనిషై నేను చస్తున్నా
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం
రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా