************************************
Movie Details
************************************
Movie : Nalugu Sthambaalata (1982)
Song : Chinukulaa raali, Nadulugaa Saagi
Star-Casting : Naresh, Poornima, Pradeep,Tulasi
Lyrics : Veturi Sundararama Murthy
Singers : S.P.Balu, Suseela
Music : Rajan Nagendra
Key-words : Chinukulaa raali
*****************************
Song Lyrics
*****************************
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే
నా ప్రేమా
నదివి నీవు కడలి నేనూ
మరచి పోబోకుమా మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరేఏ నా ప్రేమా
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి
ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మల లోనే నేవేచి వుంటానులే
జన్మలుదాటే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి
సుమములై పూచి
ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ
నా ప్రేమ
నీ పేరే నా ప్రేమా
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా
విరహమైపోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై
అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వులకోసం
వేసారుతున్నానులే
నింగికి నేలా అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నీడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి
గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమా
నా ప్రేమా
తారాడే మన ప్రేమా
భువనమైనా గగనమైనా ప్రేమమయమే
సుమాహా
ప్రేమమనమే సుమా
చినుకులా రాలి
నదులుగా సాగి
వరదలై పోయి
కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమా
నీ పేరేఏ నా ప్రేమా
Tagged
Chinukulaa Raali Nadulugaa Saagi Chinukulaa Raali Nadulugaa Sagi Chinukulaa Raali Naduluga Sagi Chinukulaa Rali Naduluga Sagi Chinukulaa Rali Naduluga Sagi Chinukulaa Raali Chinukulaa Rali Chinukula Rali Chinukula Raali Nadulugaa Saagi Chinukula Rali Nadulugaa Saagi Chinukula Rali Naduluga Saagi Chinukula Rali Naduluga Sagi Chinukula Rali 1982-Naalugu-Sthambaalaata 1982-Nalugu-Sthambaalaata 1982-Nalugu-Stambaalaata 1982-Nalugu-Stambaalata Naalugu-Sthambaalaata Nalugu-Sthambaalaata Nalugu-Stambaalaata Nalugu-Stambaalata