************************************
Movie Details
************************************
Movie : Chanti
Song : Ennenno Andaalu, Evevo Ragaalu
Star-Casting : Venkatesh, Meena
Lyrics : Veturi Sundararama Murthi
Singer(s) : S.P.Balu, Chithra
Music : Ilayaraja
Keywords : Yennenno Andaalu
*****************************
Song Lyrics
*****************************
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
వేసే పూల బాణం
పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం
హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలిమర గదులలొ సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా
అందాలా మేడల్లోనే అంటదు కాలికి మన్నూ
బంగారూ పంటలు పండే మన్నుకు చాలదు మిన్నూ
నిరుపేదిల్లు పొదరిల్లూ
ఇలలో ఉన్న హరివిల్లూ
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
వేసే పూల బాణం
పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం
హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
జల జల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిల మిల మెరిసిన తళ తళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలీ మేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లే సింగారాలూ నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళూ
తెలుగింటమ్మ తిరునాళ్ళూ
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
వేసే పూల బాణం
పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం
హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలూ
ఏవేవో రాగాలూ
Tagged :
Yennenno-Andaalu-Yevevo-Ragaalu Yennenno-Andaalu-Yevevo-Ragalu Yennenno-Andalu-Yevevo-Ragalu Yennenno-Andalu-Yevevo-Ragalu Eennenno-Andaalu-Eevevo-Ragaalu Eennenno-Andaalu-Evevo-Ragalu Eennenno-Andalu-Evevo-Ragalu Eennenno-Andalu-Evevo-Ragalu 1992-Chanti Chanti