All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Mounangaane Yedagamani (Female Version) Song in Telugu - Naa Autograph Sweet Memories Movie - Ravi Teja, Bhoomika, Gopika


*****************************
Song Lyrics
*****************************

Movie : Naa Autograph Sweet Memories
Song : Mounangaane Yedagamani Mokka Neeku  (Female Version)
Star-Casting : Ravi Teja, Bhoomika, Gopika
Lyrics : Chandra Bose
Singer(s) : Chitra
Music : M.M.Keeravani
Key-Words : Mounangane Eedagamani

*****************************
Song Lyrics
*****************************

మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ   అర్థమందులోవుందీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులోవుందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే  కొత్త చిగురు కనిపిస్తుంది 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ   అర్థమందులోవుందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుందీ
ఆకులన్ని రాలిన చోటే  కొత్త చిగురు కనిపిస్తుందీ

దూరమెంతొ ఉందనీ  దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందనీ  బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంటా ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే  విషమే వచ్చిందీ
విసుగే చెందక కృషి చేస్తేనే  అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ  తలుచుకుంటె సాధ్యమిదీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుందీ
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులో  ఉందీ

చెమటనీరు చిందగా  నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని  గుర్తుంచుకో
పిడికిలే బిగించగా  చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని  గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను  బ్రహ్మేరాస్తాడూ
నచ్చినట్టుగా నీ తలరాతను  నువ్వే వ్రాయాలీ
నీ ధైర్యాన్ని దర్షించి   దైవాలే   తలదించగా
నీ అడుగుల్లొ గుడి కట్టి  స్వర్గాలె  తరియించగా
నీ సంకల్పానికి  ఆ విధి సైతం చేతులెత్తాలి

అంతులేని చరితలకీ  
ఆది నువ్వు కావాలీ 

 మౌనంగానే ఎదగమనీ  మొక్క నీకు చెబుతుందీ
ఎదిగినకొద్దీ ఒదగమనీ  అర్థమందులో ఉందీ
అపజయాలు కలిగినచోటే  గెలుపు పిలుపు వినిపిస్తుందీ
ఆకులన్ని రాలినచోటే  కొత్త చిగురు కనిపిస్తుందీ






Tagged :

Mounangaane-Yedagamani-Mokka-Neeku Mounangaane-Yedagamani-Mokka Mounangaane-Yedagamani Mounangaane-Yedagamani-Mokka-Neeku Mounangaane-Yedagamani-Mokka-Neeku-Female Mounangaane-Yedagamani-Mokka-Female Mounangaane-Yedagamani-Female Mounangaane-Yedagamani-Mokka-Neeku-Female Mounangane-Yedagamani-Mokka-Neeku Mounangane-Yedagamani-Mokka Mounangane-Yedagamani Mounangaane-Edagamani-Mokka-Niku-Female Mounangaane-Edagamani-Mokka-Female Mounangaane-Edagamani-Female Mounangaane-Edagamani-Mokka-Niku-Female Mounangaane-Edagamani-Mokka-Niku Mounangaane-Edagamani-Mokka Mounangaane-Edagamani Mounangaane-Edagamani-Mokka-Niku Mounangane-Edagamani Mounangane-Edagamani-Mokka Mounangane-Edagamani-Mokka-Niku Mounangane-Edagamani-Female Mounangane-Edagamani-Mokka-Female Mounangane-Edagamani-Mokka-Niku-Female Mounangane-Yedagamani-Mokka-Neeku-Female Mounangane-Yedagamani-Mokka-Female Mounangane-Yedagamani-Female Naa-Autograph-Sweet-Memories Na-Autograph-Sweet-Memories