All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Priyathama Nanu Palakarinchu Pranayama Song in Telugu - Jagadeka Veerdu Athiloka Sundari Movie - Chiranjeevi, Sridevi


************************************
Movie Details
************************************

Movie : Jagadeka Veerdu Athiloka Sundari
Song : Priyathamaa Nanu Palakarinchu Pranayamaa
Star-Casting : Chiranjeevi, Sridevi
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balasubramanyam, Janaki
Music : Ilayaraja
Key-Words : Priyathama nanu palakarinchu


*****************************
Song Lyrics
*****************************

ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
బ్రతుకులోని  బంధమా  పలుకలేని భావమా
మరువలేని స్నేహమా  మరలిరాని నేస్తమా
ప్రియతమా   ప్రియతమా  ప్రియతమా   

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా  
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
ఎదుటవున్న స్వర్గమా  చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా  కౌగిలింత ప్రాణమా
ప్రియతమా   ప్రియతమా  ప్రియతమా  

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా

నింగి వీణకేమొ  నేల పాటలొచ్చె  తెలుగూ జిలుగూ అన్నీ తెలిసి
పారిజాత పువ్వు  పచ్చి మల్లెమొగ్గ   వలపే తెలిపే నాలోవిరిసి
మచ్చలెన్నో వున్నా  చందమామకన్నా  నరుడే వరుడై నాలోమెరిసే
తారలమ్మ కన్నా  చీరకట్టుకున్నా పడుచూ తనమే నాలోమురిసే
మబ్బులన్నీ వీడిపోయి  కలిసే నయనం  తెలిసే హృదయం  
తారాలన్నీ దాటగానే   తగిలే గగనం  రగిలే విరహం 
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి  గొంతులో  ఎన్ని మూగపాటలో అడుగే పడకా గడువే గడిచీ పిలిచే 

 ప్రియతమా   నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదొ  వేణువూదిపోయె   శ్రుతిలోజతిలో నిన్నేకలిపి
దేవగానమంతా  ఎంకిపాటలాయె  మనసుమమతా  అన్నీకలిసీ
వెన్నెలల్లే వచ్చి  వేదమంత్రమాయె  బహుశామనసా  వాచావలచి
మేనకల్లేవచ్చి  జానకల్లేమారె  కులమూ గుణమూ  అన్నీకుదిరీ
నీవులేని నింగిలోన  వెలిగేఉదయం  విధికే విలయం
నీవులేని నేలమీద  బ్రతుకేప్రళయం  మనసేమరణం
వాన విల్లు గుండెలో  నీటికెన్ని రంగులో
అమృతాల విందులో  ఎందుకిన్ని హద్దులో  జగమే అణువై యుగమె క్షణమై మిగిలే 

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా
బ్రతుకులోని  బంధమా  పలుకలేని భావమా
కనులలోని కావ్యమా  కౌగిలింత ప్రాణమా
ప్రియతమా    ప్రియతమా    ప్రియతమా

 ప్రియతమా  నను పలకరించు  ప్రణయమా
అతిథిలా  నను చేరుకున్న  హృదయమా