All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Chukkallara Choopullara Yekkadamma Jaabili Song in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri


************************************
Movie Details
************************************

Movie : Aapadbhandavudu
Song : Chukkallara Choopullara Yekkadamma Jaabili
Star-Casting : Chiranjeevi, Meenakshi SheShadri
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : M.M.Keeravani
Key-Words : Chukkallara Choopullara


*****************************
Song Lyrics
*****************************

చుక్కల్లారా  చూపుల్లారా  ఎక్కడమ్మా జాబిలీ
మబ్బులారా  మంచుల్లారా   తప్పుకోండే దారికీ
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ
విన్నవించారా  వెండిమింటికీ
జో జో  లాలీ 
జో జో  లాలీ
జో జో  లాలీ 
జో జో  లాలీ

మళిసంజ వేళాయే  చలిగాలి వేణువాయే
మళిసంజ వేళాయే  చలిగాలి వేణువాయే 
నిదురమ్మా  ఎటుబోతివె
మునిమాపు వేళాయే  కనుపాప నిన్ను కోరే 
కునుకమ్మా  ఇటు చేరవే
తన్నన్నన్న తనన  
తన్నన్నన్న తాననా 
నిదురమ్మా  ఎటుబోతివే
 ఇటు చేర
గోధూళి  వేళాయె  గూళ్ళన్నీ కనులాయే
గోధూళి  వేళాయె  గూళ్ళన్నీ కనులాయే
గువ్వలరెక్కల పైనా  రివ్వూ రివ్వున రావే
జోలపాడవా  వేలకళ్ళకీ 
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ 
జో జో  లాలీ  
జో జో  లాలీ

పట్టు పరుపులేల   పండు వెన్నెలేల  అమ్మఒడి చాలదా  బజ్జోవె తల్లి
పట్టు పరుపేలనే 
అమ్మఒడి చాలునే  నిను చల్లంగ జోకొట్టునే
నార దాదులేలా  నాద బ్రాహ్మలేల  
అమ్మలాలి చాలదా  బజ్జోవె తల్లి  
నారదాదులేలనే   నాద బ్రాహ్మలేలనే  
అమ్మలాలి చాలునే  నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో  ఎన్ని వేల  వెన్నెల్లో
తీయ్యనైన కలలెన్నో  ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడికొమ్మలా  ఏడి ఏవయ్యాడే అంతు లేడియాల  కోటితందనాల  ఆనందలాలా
గోవులాల పిల్లగోవులాల గొల్లభామలాల యాడ నుందీయాల  నాటినందనాల  ఆనందలీలా
జాడ చెప్పరా  చిట్టి తల్లికీ
వెళ్లనివ్వరా  వెన్నెలింటికీ
జో జో జోలాలీ   
జో జో లాలీ

చుక్కల్లారా  చూపుల్లారా  ఎక్కడమ్మా జాబిలీ
మబ్బులారా  మంచుల్లారా  తప్పు కోండే దారికీ