************************************
Movie Details
************************************
Movie : Kante Kuthurne Kanaali
Song : Aada Koothura Neeku Adugaduguna Vandanam
Star-Casting : Ramya Krishna, Prudhvi
Lyrics : Suddala Ashok Teja
Singer(s) : Chitra
Music : Vandemaataram Srinivas
Key-Words : Aada Kuthura
*****************************
Song Lyrics
*****************************
ఆడ కూతుర నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం
ఆడ కూతుర నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం
మహారాజులే మగాళ్ళు అందరూ
తెల్లవారినా నిదుర లేవరూ
కంటినిండ కునుకు కనలేదు నీవెప్పుడూ
సగము నిదురలోనే నిను లేపేనూ చీపురు
మగ బిడ్డల యోగమేవిటో
లేవగానె భోగమేవిటో
ఎగతాళిగ నిన్నేగని నవ్వె పాచి గిన్నెలూ
ఆడ కూతుర నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం
బండ చాకిరీ రేబవలు చేసినా
గుండె బరువునీ నీ పేరు పెట్టిరీ
పదహారవ ఏట ఇక మొదలు వరుడి వేట
నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట
పుటకనుండి చావు మధ్యనా
బతుకునంత అరగదీసినా
ఏ జీతము ఏ సెలవూ ఎరుగని ఒక దాసివీ
ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం
పెళ్లి పీటపై కంఠాన్ని ముడేసీ
నాతిచరామీ అంటాడు ఒట్టేసీ
అక్షింతలతోనే మంత్రాలు నేలపాలూ
మరునాటి నుండి నీ బతుకు బూటుకాలు
ఇంటికి దీపం ఇల్లాలూ
అత్త మామ కాదంటే చీకటి పాలూ
మగవాడే నీ నొసటన రాసె మనువు రాతలే
ఆడ కూతుర నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం