All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Yevaru Raayagalaru Amma Anu Maatakanna Song in Telugu - Amma Raajeenaama Movie - Saarada, Satyanaarayana, Saikumar


************************************
Movie Details
************************************

Movie : Amma Raajeenaama (1991)
Song : Yevaru Raayagalaru, Amma Anu Maatakanna
Star-Casting : Saarada, Satyanaarayana, Saikumar
Lyrics : Sirivennela Seetharamasathry
Singer(s) : K.S.Chitra
Music : Chakravarthy
Key-Words : Evaru Raayagalaru


*****************************
Song Lyrics
*****************************

ఎవరు రాయగలరూ
అమ్మా అను మాటకన్న  కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ 
అమ్మా  అను రాగం కన్న  తీయని రాగం
అమ్మేగా
అమ్మేగా తొలిపలుకూ నేర్చుకున్న భాషకీ 
అమ్మేగా ఆదిస్వరం  ప్రాణమనే పాటకీ

 ఎవరు రాయగలరూ  అమ్మా అను మాటకన్న  కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ  అమ్మా  అను రాగంకన్న  తీయని రాగం

అవతారమూర్తి అయినా  అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే  అంతవాడు ఔతాడు 
అవతారమూర్తయినా  అణువంతే పుడతాడు   
అమ్మపేగు పంచుకునే  అంతవాడు ఔతాడు
అమ్మేగా
అమ్మేగా చిరునామా  ఎంతటి ఘనచరితకీ
అమ్మేగా  కనగలదూ   అంత గొప్పఅమ్మనీ 

 ఎవరు రాయగలరూ  అమ్మా  అను మాటకన్న  కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ  అమ్మా అను రాగంకన్న  తీయని రాగం

శ్రీ రామ రక్ష అంటూ  నీళ్లు పోసి పెంచింది
దీర్ఘాయురస్తు అంటూ నిత్యందీవించింది
శ్రీ రామరక్ష అంటు  నీళ్లు పోసి  పెంచింది
దీర్ఘాయురస్తు అంటు  నిత్యం దీవించింది
నూరేళ్ళూ 
నూరేళ్ళూ ఎదిగె బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో
నడక నేర్చుకుంది బ్రతుకు  అమ్మ చేతి వేళ్ళతో 

 ఎవరు రాయగలరూ  అమ్మా  అను మాటకన్న  కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ  అమ్మా  అను రాగంకన్న  తీయని రాగం
అమ్మేగా తొలిపలుకూ నేర్చుకున్న భాషకీ
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకీ

  ఎవరు రాయగలరూ  అమ్మా అను మాటకన్న  కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ  అమ్మా  అను రాగంకన్న  తీయని రాగం