************************************
Movie Details
************************************
Movie : Shiva (1989)
Song : Botany Paathamundi, Maatani Aata vundi
Star-Casting : Nagarjuna, Amala, Subhalekha Sudhakar
Lyrics : Sirivennela Seetharaama Saasthry
Singer(s) : S.P.Balu, S.P.Sailaja
Music : Ilayaraaja
Key-Words : Botany Paatamundi
*****************************
Song Lyrics
*****************************
బోటనీ పాఠముంది మాటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పారా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రొస్టు కన్న రెస్టు మేలు
పాటలూ ఫైటలున్న ఫిల్ము చూడు
బ్రేకులూ డిస్కోలూ చూపుతారు
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
దువ్వెనే కోడి జుట్టు నవ్వేనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబూ
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబూ
జోరుగా వచ్చాడే జేమ్సు బాండు
ఈరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు
పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
అయ్యో మార్చినే తల్చుకుంటే
మూఁర్చులే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా
ఛి
తాళం రాదు మార్చట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తల్చుకుంటే మూర్చులే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఎంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాన్న
వెళ్ళారా సులువైన దారిలోనాయ్
ఉందిగా సెప్టెంబరు మార్చిపైన
అరె వాయిదా పద్ధతుంది దేనికైనా
మ్యాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ పై ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా రేయ్
తందనా తందనన తందనా తందనన
తందనా తందనాననాననా
క్రాఫు పై ఉన్న శ్రద్ధ గ్రాఫు పై
పెట్టు కాస్త ఫస్టు ర్యాంకు పొందవచ్చు రోయ్
తందనా తందనన తందనా తందనన
తందనా తందనాననాననా
అరె ఏంది సార్
లెక్కలూ ఎక్కాలు తెల్వనోల్లు లక్కుతోని లచ్చలల్లొ మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెతోళ్ళు
సర్కారీ క్లర్కులైయ్యి మురిగిపోతరు
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడజాం