*****************************
Movie Details
*****************************
Movie : Praanam Khareedu
Song : Yaathamesi Thodinaa Yeru Yendadu
Star-Casting : Jayasudha, Chandra Mohan, Chiranjeevi
Lyrics : Jaalaadi
Singer(s) : S.P.Balu
Music : K.Chakravarthy
Key-Words : Yaathamesi Thodinaa
*****************************
Song Lyrics
*****************************
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే
ఆ దీపముండదూ
ఆ దీపముండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదూ
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితినీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపుకోత కోసినా అది మనిషికే జన్మ ఇస్తాదీ
బొడ్దుపేగు తెగి పడ్డా రోజు తెలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలోవున్నా సెట్టునీడ తొంగున్నా
నిదర ముందర పడినాకా
పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారా
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే
ఆ దీపముండదూ
ఆ దీపముండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ