*****************************
Movie Details
*****************************
Movie : Mahaanati
Song : Abhinethri, O Abhinethri, Abhinayanethri (Title song)
Star-Casting : Keerthi Suresh , Dulkar Salmaan
Lyrics : Raamajogayya Saasthry
Singer(s) : Anurag Kulkarni
Music : Mickey.J.Meyer
Key-Words : Abhinethri, O Abhinethri ; Mahaanati
*****************************
Song Lyrics
*****************************
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నటగాయత్రి
మనసారా నిను కీర్తించీ పులకించినదీ ఈ జనధాత్రి
నిండుగా ఉందిలే దుర్గ దీవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కళకే అంకితం నీ కణం కణం
వెండి తెరకెన్నడో ఉందిలే ఋణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికే సౌభాగ్యం
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరిత పుటలోన వెలుగు పొదిగావు
పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖ చిత్రమై నలుచరగులా తల ఎత్తినదీ మన తెలుగూ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుదకు మిగిలేది అందుకున్నావు
పరమార్ధానికీ అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకేగామరీ నీదైనది నువుగా అడగని వైభోగం
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ
మహానటీ మహానటీ