All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Okka Poota Annam Kosam Yeduru Choodadam Song Lyrics in Telugu - Bicchagaadu Movie - Vijay Antony, Satna Titus


************************************
Movie Details
************************************

Movie : Bicchagaadu (2016)
Song : Okka Poota Annam Kosam Yeduru Choodadam
Star-Casting : Vijay Antony, Satna Titus
Lyrics : Basha Sri
Singer(s) : Yasin
Music : Vijay Antony
Key-Words : Okka Puta Annam

*****************************
Song Lyrics
*****************************

ఒక్క పూట అన్నం  కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడా బూడిదౌతున్నా 
మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడె  కొంచం ఇస్తే లేనివాడె వుండడే
కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే

ఒక్క పూట అన్నం  కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం

అన్నివున్న ఏదో కోరీ చేయి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద బిచ్చగాడెరా
పుట్టబోయె మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితె
గూడులేని వాడికి పాపం దేవుడె మాత్రము దిక్కురా
నువ్వెతికే  ఆ ఏదో ఒక్కటి దొరకగా పోగా నీకూ
అవమానం ఎదురవ్వును దినదినమూ ప్రతిదినమూ 
ఏమున్నది ఇన్నాళ్ళుగా నీకూ జీవించావుర నువ్వూ  
ఆ ధైర్యం నువు వీడక వుండర దేవుడె అండర నీకూ  

ఒక్క పూట అన్నం  కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడా బూడిదౌతున్నా 
మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడె  కొంచం ఇస్తే లేనివాడె వుండడే
కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే