*****************************
Movie Details
*****************************
Movie : Geethaanjali
Song : O Priya Priyaa, Naa Priya Priyaa
Star-Casting : Naagarjuna, Girija
Lyrics : Veturi Sundararama Murthy
Singer(s) : S.P.Balu, K.S.Chitra
Music : Ilayaraaja
Key-Words : O Priya Priyaa
*****************************
Song Lyrics
*****************************
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలూ
రాలు పూల దండలూ
నీదో లోకం నాదో లోకం
నింగీ నెలా తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలూ
మాసిపోవు ఆశలూ
నింగీ నేలా తాకే వేళా
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే
నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ పేదవాడి కంటిలో ప్రేమ రక్తమూ
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు వెలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకూ
రాజ శాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
కాళిదాసు గీతికీ కృష్ణ రాస లీలకీ ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవీ
ఆ అనారు ఆశకీ తాజ్మహల్ శోభకీ పేద వాడి
ప్రేమకీ తావు పల్లకీ
నిధి కన్నా ఎద మిన్నా గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమనే
వెళ్లిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్లిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసి
నింగీ నెలా తాకే వేళా నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం
లేదు బంధనం
ప్రేమకే జయం
ప్రేమదే జయం