************************************
Movie Details
************************************
Movie : Dhamarukam (2012)
Song : Nesthama Nesthama Nuvve Koyilai
Star-Casting : Nagarjuna, Anushka
Lyrics : Bhaskar Batla
Singer(s) : Sri Krishna, Harini
Music : Devi Sri Prasad
Key-Words : Nestama Nestama Nuvve
*****************************
Song Lyrics
*****************************
నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వూ నువ్వనే మాటలో నేనూ ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓహో ప్రేమకే ఊపిరే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే నిండుగా ఉండదా మనలాగా
హో నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడనా నీకోసం
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం
కనుపాపలోనా నీవే కలా ఎదయేటిలోనా నువ్వే
అలా క్షణకాలమైనా చాల్లే ఇలా
అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలే
హో నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడనా నీకోసం
అలుపొస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరొస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచుపైనా నువ్వేకదా పైటంచు మీదా నువ్వేకదా నడుమొంపులోన నువ్వే కదా
ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే
హో నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడనా నీకోసం