************************************
Movie Details
************************************
Movie : Oo Paapa Laali
Song : Maate raani Chinnadaani Kallu Palike
Star-Casting : S.P.Balasubramanyam, Radhika
Lyrics : Veturi Sundararama Murthy
Singers : S.P.Balu
Music : Ilayaraja
Key-Words : Maate raani Chinna daani
*****************************
Song Lyrics
*****************************
మాటేరాని చిన్నదానీ కళ్ళు పలికే
ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే
పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగతలపే వలపు పంటారా
మాటేరాని చిన్నదానీ కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగతలపే వలపుపంటారా
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు
చిలికెను
చంతచేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు ఝల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలె నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహనరాగం
చిలకల పలుకులు అలకలు
ఉలుకులు నా చెలిసొగసులు నన్నే మరిపించే
మాటేరాని చిన్నదానీ
కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే
పాటలూ
ముద్దబంతి లేత నవ్వులు చిందెను
మధువులు
ఊసులాడు మేనివగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి
సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సంధ్యవేళ పలికే నాలో పల్లవి
సంతసార సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నాచెలిసొగసులు అన్నీఇక నావే
మాటేరాని చిన్నదానీ కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా
రేగే మూగతలపే వలపుపంటారా
మాటేరాని చిన్నదానీ
కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ