************************************
Movie Details
************************************
Movie : Pallakilo Pelli Koothuru
Song : Naa Peru Cheppukondi Meelo Yevaraina
Star-Casting : Goutham, Radhi
Lyrics : Chandra Bose
Singer(s) : Sunitha
Music : M.M.Keeravani
Key-Words : Naa peru Cheppukondi
*****************************
Song Lyrics
*****************************
నా పేరు చెప్పుకోండీ మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండీ మీలో ఒకరైనా
చల్లగాలీ చందమామా మల్లెతీగా చిలకమ్మా
మీలో ఒకరైనా
నాపేరు చెప్పుకోండీ
నాపేరు చెప్పుకోండీ
నీలి మేఘాలతోటీ ఆడుకుంటానుగానీ నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాల వాణీ పాడుకుంటానుగానీ నా పేరు రాగిణి కాదు
బంగారమంటీ మనసుందికానీ నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు
ఓటమంటూ ఒప్పుకోను విజయను కాను
ఒట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను
ఊహను కాను కల్పన కాను
నా పేరు
నా నా నా పేరు చెప్పుకోండీ మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండీ మీలో ఒకరైనా
చిన్నిచెక్కిళ్ళలోనా కొన్ని గులాబీలున్నా నాపేరు రోజా కాదు
అన్ని పుష్పాలుచేరీ నన్ను అర్చించుతున్నా నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సుకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
బోలెడంత జాలి వుంది కరుణను కాను
అంతులేని పేరు వుంది కీర్తిని కాను
మీరేమీరే తేల్చాలండీ
మీరానసలే కానే కాను
నా పేరు
నా నా నాపేరు చెప్పుకోండీ మీలో ఎవరైనా
నాపేరు చెప్పుకోండీ మీలో ఒకరైనా
చల్లగాలీ చందమామా మల్లెతీగా చిలకమ్మా
మీలో ఒకరైనా
నా పేరు
రాణీ రాణీ రాణీ