************************************
Movie Details
************************************
Movie : Ashwamedham (1992)
Song : O Prema, Naalo Nuvve Prema, Navve Prema
Star-Casting : Balakrishna, Nagma, Meena
Lyrics : Veturi Sundara rama Murthy
Singer(s) : S.P.Balu, Asha Bhosle
Music : Ilayaraaja
Key-Words : O Prema, Naalo Nuvve Prema
*****************************
Song Lyrics
*****************************
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక ఏదేమైన రావే మైన రాగాలెన్నో తీసే ప్రేమ తెలుస
అదరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా
చలువ రాతి హంస మేడలో ఎండే చల్లనా
విలువ చాటు అందగత్తెల్లో వయసే వెచ్చనా
వసంతపూ తేనె తోనే తలంటులే పోయునా
వరూధినీ సోయగాలా స్వరాలు నే మీటనా
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్వింది రాగం
రెండు గుండెల్లోన తప్పింది తాళం
మురిసింది తార మూగాకాశంలో
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక నేనేమైన నీకేమైన గాలై వీచి కూలే ప్రేమ తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగా నే వున్నా
కల మారి కాటేస్తుంటే కొడిగట్టి పోతున్నా
ఎడబాటే ఎదపాటై చలి నీడగా సాగే వేళ
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా
మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవీ
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవీ
ఎడారిలో కోయిలమ్మా కచేరి నా ప్రేమగా
ఎదారి నా దారిలోనే షికారులే నావిగా
కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గ లోకంలోనే పెళ్ళీ పేరంటం
సందే మైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తారా ప్రేమాకాశంలో