All the Lyrics Provided here are based on the movie Lyrics of a song. There is no imitation/Criticism entertained in this Process.

ఇందులోని పాటల సాహిత్యం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు.కేవలం పాటల సాహిత్యాన్ని పూర్తిగా వ్రాయడంలో చేసిన ప్రయత్నం మాత్రమే.

Pavuraniki Panjaraniki Pelli Chese Song in Telugu - Chanti Movie - Venkatesh, Meena

*****************************
Movie Details
*****************************

Movie : Chanti (1992)
Song : Pavuraniki Panjaraniki Pelli Chese
Star-Casting : Venkatesh, Meena
Lyrics : Veturi Sundararama Murthy
Music : Ilayaraja
Singer(s) : S.P.Balu
Key-Words : Pavuraniki Panjaraniki

*****************************
Song Lyrics
*****************************

పావురానికీ పంజరానికీ పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టె మూఢలోకం 
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ ఓ

పావురానికీ పంజరానికీ పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టె మూఢలోకం  

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపీ సాకింది నా కన్న తల్లీ
లాలించు పాటలో నీతంతా తెలిపీ పెంచింది నాలోన మంచీ 
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా 
ఇది తీరేదే కాదా

పావురానికీ పంజరానికీ పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టె మూఢలోకం   
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ ఓ

పావురానికీ పంజరానికీ పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టె మూఢలోకం 

తాళంటె తాడనే తలచాను నాడూ
అది ఏదో తెలిసేను నేడూ
ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజమూ
తరువాత తెలిసేమి ఫలమూ
ఏమైన ఏదైన జరిగింది ఘోరం
నా మీద నాకేలె కోపం
నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా  
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాధే పోదా